Home సినిమాలు ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాపై వ‌చ్చిన క్లారిటీ..!

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాపై వ‌చ్చిన క్లారిటీ..!

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కన్నడ సినిమా స్టామినాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లి దర్శకుడు ఈయన. తొలి సినిమా ‘ఉగ్రం’తో బ్లాక్ బస్టర్ అందుకుని తానేంటో నిరూపించుకున్నారు. ఇక రెండో సినిమాతో జాతీయ స్థాయిలో గర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘సలార్’తో బిజీగా ఉన్నారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఈ మధ్య ప్రశాంత్ నీల్ ఊతమిచ్చారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా “నూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్‌ను తీసుకొస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్ ఈరోజు మీకు ఎంతో సురక్షితంగా, గొప్పగా ఉండాలి. త్వరలోనే కలుద్దాం’’ అని తన  ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.

అలాగే ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. గతేడాది జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘స్టార్ డైరెక్టర్,అద్భుతమైన వ్యక్తి ప్రశాంత్ నీల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. త్వరలోనే రేడియేషన్ సూట్‌లో కలుసుకోవాలని వేచి చూస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తరఫున ఒక బర్త్‌డే విషెస్ పోస్టర్ కూడా వదిలారు. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సినిమాను చేయబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రేడియేషన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నారు. కాగా, ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభించాలని ప్రశాంత్ నీల్ యోచిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందాన‌కి అవ‌ధులు లేకుండా పోయాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు