Home సినిమాలు ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ క్రేజీ అప్‌డేట్‌.. విల‌న్‌గా మారనున్న స్టార్ క‌మెడీయ‌న్‌!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ క్రేజీ అప్‌డేట్‌.. విల‌న్‌గా మారనున్న స్టార్ క‌మెడీయ‌న్‌!

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేష‌న్ త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్‌. ఈ ఇద్ద‌రూ మ‌రో ప్రాజెక్టును లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నాగ‌వంశి నిర్మించ‌నున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌ తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్లక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.. ఈ క్రమంలో ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? అని అటు ఎన్టీఆర్‌, ఇటు త్రివిక్ర‌మ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై యస్‌. రాధాకష్ణ, కల్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతాన్ని అందించనున్నారు. పోలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ సునీల్, యువ హీరో నవీన్ పొలిశెట్టి  కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మూవీలో సునీల్  ప్రతినాయక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఇన్నాళ్లూ కమెడియన్ గా తన స్నేహితుడికి అవకాశాలు ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు సునీల్‌ను విలన్ గా నిలబెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.
కాగా, ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ తో పాటు చౌడప్ప నాయుడు అనే మరో టైటిల్ కూడా వినిపిస్తుంది. ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే వర్క్‌ టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్‌ నుంచి సమాచారం. మేలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకేళ్లేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం.

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు