Home ప్రత్యేకం ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక.. 'ఆర్ఆర్ఆర్' నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్ రిలీజ్

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్ రిలీజ్

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు. అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే విడుదల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో సినిమాపై ఆస‌క్తి పెంచేందుకు ఒక్కో అప్‌డేట్ ఇస్తూ వ‌స్తున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉగాది పర్వదినం సంద‌ర్భంగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, చరణ్ చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ అటు మెగా అభిమానుల‌ని, ఇటు నందమూరి ఫ్యాన్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  కాగా, రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్‌సన్‌, అలీ సన్‌ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు