Home సినిమాలు ఎన్టీఆర్-కొరటాల మూవీ: యంగ్ టైగర్ హీరోయిన్‌ ఎవరో ఫిక్సయింది

ఎన్టీఆర్-కొరటాల మూవీ: యంగ్ టైగర్ హీరోయిన్‌ ఎవరో ఫిక్సయింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తారన్న ప్రచారం మొదలైంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30వ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ హాట్ బ్యూటీ   కియారా అద్వానీని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కియారా అద్వానీ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి కియారానే తీసుకురావాలని కొరటాల గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఈ సినిమాను త్వరలో లాంఛనంగా ప్రారంభించి జూన్‌ ద్వితీయార్థంలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం యోచిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు