Home టీవీ ఎన్టీఆర్ కొత్త షోపై క్రేజీ అప్‌డేట్‌..!

ఎన్టీఆర్ కొత్త షోపై క్రేజీ అప్‌డేట్‌..!

యంగ్‌ టైగర్‌ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే చిత్రంలో యంగ్ టైగర్ హీరోగా నటించనున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. ఈ రెండింటి తర్వాత ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోతో టీవీ స్క్రీన్ పై అలరించేందుకు సిద్దమవగా.. క‌రోనా సెకండ్ వేవ్‌తో కొంత ఆలస్యం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో కు సంబంధించి ఆఫ్ లైన్ లో పనులు అన్ని శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం తిరుపతిలో ఈ షోలో పాల్గొనే వ్యక్తుల కోసం ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి ఈ ఆడిషన్స్ పూర్తి అయ్యాక ఎన్టీఆర్ ఈ షోతో హాట్ సీట్ లో సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు. మరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గ్రాండ్ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనేది చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు