Home ప్రత్యేకం 'ఎన్టీఆర్‌30': కొరటాలతో యంగ్ టైగర్ మరో సినిమా ఫిక్స్‌.. పూర్తి వివరాలు ఇవే!

‘ఎన్టీఆర్‌30’: కొరటాలతో యంగ్ టైగర్ మరో సినిమా ఫిక్స్‌.. పూర్తి వివరాలు ఇవే!

ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని  కొరటాల శివతో చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. అంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై నందమూరి కల్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. జూన్‌ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఏప్రిల్‌ 29, 2022న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు