Home ప్రత్యేకం ‘ఎన్టీఆర్‌ 30’: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ స్టొరీ సిద్ధం చేస్తున్న కొరటాల!

‘ఎన్టీఆర్‌ 30’: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ స్టొరీ సిద్ధం చేస్తున్న కొరటాల!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఒకటి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా భారీ హిట్ సాదించిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కాగ్, ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రెండో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసేశారు. అయితే తాజాగా ఈ సినిమా కథ విషయమై ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. మాములుగా కొరటాల శివ చిత్రాల్లో సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా కలగలిసి ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా కోసం కూడా కొరటాల అదే శైలిని అనుసరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం నిజమైతే ఎన్టీఆర్ పొలిటికల్ డ్రామాలో నటించడం అదే మొదటిసారి అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. అతి త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రబృందం

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు