Home సినిమాలు ‘ఎన్టీఆర్‌ 30’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. యంగ్ టైగర్ పాత్రపై ఫుల్ క్లారిటీ!

‘ఎన్టీఆర్‌ 30’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. యంగ్ టైగర్ పాత్రపై ఫుల్ క్లారిటీ!

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఇంతవరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నాడట. ఇందులో అతడు ఓ మారుమూల గ్రామం నుంచి పట్టణానికి చేరుకున్న ఓ యువకుడి పాత్రలో కనిపిస్తాడట. గతంలో కొరటాల శివ – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో అన్యాయాలను ఎదుర్కొంటూ, పర్యావరణాన్ని రక్షించే సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎన్టీఆర్‌ నటించి అలరించాడు. మరి కొర‌టాల ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడోన‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

కాగా, ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో ఎన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీని తీసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు