Home సినిమాలు ఎన్టీఆర్‌- త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నందమూరి ఫ్యాన్స్ గోల పెట్టే ప్లాన్..

ఎన్టీఆర్‌- త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నందమూరి ఫ్యాన్స్ గోల పెట్టే ప్లాన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘అరవింద సమేత’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసిన ఈ జోడీ ఈ సారి మరింత బలమైన కథతో రంగంలోకి దిగనుందట. ఈ మేరకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన త్రివిక్రమ్.. చిత్రానికి సంబంధించి అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్  చేస్తోంది చిత్రబృందం.

ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంతో థియేటర్లన్నీ నందమూరి అభిమానుల ఈలలతో గోల పెట్టాల్సిందే అని ఫిక్స్ అయిన త్రివిక్రమ్.. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్‌ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట. కాబట్టి ఎన్టీఆర్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్రివిక్రమ్‌ సినిమా కోసం డేట్స్‌ను కేటాయిస్తాడట.  సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 13న ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్‌ నెలలో వారం పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఎన్టీఆర్‌ మే, జూన్‌ నెలల్లో సినిమా కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తాడని సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు