Home సినిమాలు ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీకి బ్రేక్‌.. కారణం ఇదే!

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీకి బ్రేక్‌.. కారణం ఇదే!

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేష‌న్ త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్‌. ఈ ఇద్ద‌రూ మ‌రో ప్రాజెక్టును లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నాగ‌వంశి నిర్మించ‌నున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? అని అటు ఎన్టీఆర్‌, ఇటు త్రివిక్ర‌మ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ క్రేజీ మూవీ వాయిదా పడిందంటూ ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. చిత్ర కథ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తిగా ఉన్నాడని, ఆయన‌ కోసం మరోసారి కథలో కొన్ని మార్పులు చేసి కొత్త ప్రాజెక్ట్‌తో త్రివిక్రమ్‌ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కొంత సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ ఓ సినిమా, త్రివిక్రమ్‌ మరో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

మరోవైపు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌తో ఓ సినిమా రూపొందనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఎన్టీఆర్‌ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడట. పిరియాడికల్‌ స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా హిందీ మూవీ దంగల్‌ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్‌ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి బుచ్చి స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు