Home సినిమాలు ఎనర్జిటిక్ స్టార్ రామ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఇస్మార్ట్ హీరో హవా మాములుగా లేదు..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఇస్మార్ట్ హీరో హవా మాములుగా లేదు..!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస విజయాలతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. ఇటీవల సంక్రాంతికి ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ తర్వాతి సినిమా తాజాగా ఫిక్స్ అయింది. అయితే, గతకొంతకాలంగా రామ్ త‌న త‌ర్వాతి చిత్రాల‌ని  లింగుస్వామి, నేస‌న్, త్రివిక్ర‌మ్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్‌తో చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. ఈ క్రమంలో తాజాగా రామ్ 19వ సినిమాపై అధికారిక ప్ర‌కట‌న‌ వెలువడింది. ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అల‌రించిన లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు.

సిల్వ‌ర్ స్కీన్ ప‌తాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్‌లో చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందించ‌నున్నారు. సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో తెలియజేస్తామని చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు రామ్‌ ఈ ఏడాదిలో విడుదలైన ‘రెడ్’ చిత్రంతో హుషారుగా ఉన్నారు. 2019లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’‌ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మాస్‌ ప్రేక్షకుల నాడి కూడా పట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు