Home సినిమాలు ఎట్టకేలకు నితిన్‌‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న కీర్తి సురేష్‌

ఎట్టకేలకు నితిన్‌‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న కీర్తి సురేష్‌

యూత్ స్టార్ నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 26న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా న‌డుస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫ‌న్నీ వీడియో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ను అల‌రించింది. వీడియోలో నితిన్ త‌ల‌ అటూ ఇటూ కదులుతూ ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో  ‘జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా’ పాట వ‌స్తుంది. ఈ వీడియోకు యానిమేష‌న్ చక్కగా సెట్ కావ‌డంతో కామెడీ బాగా జనరేట్ అయింది. ఈ వీడియోకు కీర్తి సురేష్ .. హాయ్ అర్జున్.. ఇదిగో నా పగ ప్రతీకారం… ప్రేమ..- అను” అంటూ రంగ్ దే చిత్రంలో వారి పాత్ర‌ల‌పై క్లారిటీ ఇచ్చింది.

కాగా.. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా దేవీశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ ఇప్పటికే రంగ్ దే సినిమా మ్యూజికల్ హిట్ అన్న అభిప్రాయాలను వ్యక్తం అయ్యేలా చేశాయి. ఈ క్రమంలో రంగ్ దే సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తవడంతో నితిన్‌కి గట్టి నమ్మకం ఏర్పడిందని తెలుస్తోంది. రంగ్ దే సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 36కోట్ల వరకు బిజినెస్ చేయగా.. తాజాగా విదేశీ హక్కుల డీల్ కూడా పూర్తయిందని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు