Home ప్రత్యేకం ఎటూ తేల్చుకోలేకపోతున్న 'వకీల్ సాబ్'

ఎటూ తేల్చుకోలేకపోతున్న ‘వకీల్ సాబ్’

భారీ అంచనాలతో రాజకీయ పర్వం తరువాత ఓవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో వచ్చాడు. థియేటర్ల దగ్గర పాజిటివ్ టాక్ ని సాధించాడు అయితే ఈ సినిమా అమెజాన్ ప్రీమియం ఓటిటి ప్లాట్ ఫామ్  లో వచ్చేస్తుంది అనే ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనికి స్పందించిన దిల్ రాజు ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎవరు వదంతులను నమ్మ రాదని అందరూ ఈ సినిమా ని థీయేటర్ల లో చూడాలని పేర్కొన్నారు. అయితే 50  రోజుల తర్వాత దీని గురించి అధికారికంగా ప్రకటిస్తామన్నారు

కాగా, కరోనా రెండవ దశ విజృంభణతో హైకోర్టు ఆదేశ మేరకు తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించడం తో థియేటర్లకి జన సాంద్రత తగ్గింది. ఈ ఒక్క వకీల్ సాబ్ కి పర్మిషన్ ఇచ్చినా జనాలు మక్కువ చూపట్లేదు. దీంతో దిల్ రాజు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలచేయలని ఆలోచిస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమా అమిత బచ్చన్ పింక్ కి రీమేక్ అయినప్పటికీ ముఖ్యంగా మహిళల ప్రాధాన్యత పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు వేణు శ్రీరామ్ మార్పులు చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎక్కువగా మహిళలు ఉండటం దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి దిల్ రాజు అధికారిక ప్రకటన చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు