Home సినిమాలు ఎక్స్‌క్లూజివ్‌: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో నలుగురు హీరోలు..?

ఎక్స్‌క్లూజివ్‌: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో నలుగురు హీరోలు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. అందుకే వచ్చే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు తారక్. ఈయన తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉండబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. 2020లోనే ఈ సినిమా గురించి ప్రకటన వేకువడింది. కళ్యాణ్ రామ్, హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే ఉండబోతుందని తెలుస్తోంది. 

తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఇందులోనలుగురు సీనియర్ హీరోలు నటించబోతున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. అలాగే మరో సీనియర్ హీరో జయరామ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక మెయిన్ విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రాజేంద్రప్రసాద్ కూడా హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నాడట. మొత్తానికి త్రివిక్రమ్ సినిమాలో ఈ సారి నలుగురు సీనియర్ హీరోలు కనిపించబోతున్నారని సమాచారం. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు