Home సినిమాలు ఉమెన్స్ డే స్పెష‌ల్: వకీల్ సాబ్ కొత్త పోస్టర్.. పగిలిపోయిందంతే

ఉమెన్స్ డే స్పెష‌ల్: వకీల్ సాబ్ కొత్త పోస్టర్.. పగిలిపోయిందంతే

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. 

అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా చిత్రం నుండి ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప‌వ‌న్ కుర్చీలో కూర్చొని ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మ‌రో చేతిలో ఉమెన్ లా అండ్ క్రిమిన‌ల్ జ‌స్టిస్ బుక్ ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. పవర్ స్టార్ వెనుకు ఉన్న  నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల షాక్‌తో చూస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. తాజాగా విడుద‌లైన కొత్త పోస్ట‌ర్ అభిమానుల‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు