Home ప్రత్యేకం 'ఉప్పెన' స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్: స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్, స్టైలిష్ స్టార్.. ఫోటోలు వైరల్

‘ఉప్పెన’ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్: స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్, స్టైలిష్ స్టార్.. ఫోటోలు వైరల్

‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా తోనే సూపర్ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ ప్రవాహం పారిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కృతి శెట్టి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా ‘ఉప్పెన’ టీమ్ మొత్తానికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి.

ఈ క్రమంలోనే చిత్రబృందం ‘ఉప్పెన’ విజయోత్సవాలను నిర్వహించింది. సెలబ్రేటింగ్‌ ఉప్పెన’ పేరుతో హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, సుకుమార్‌, గోపీచంద్‌ మలినేని, హరీశ్‌ శంకర్, వేణు శ్రీరామ్‌, దిల్‌ రాజు, ప్రసాద్‌ పొట్లూరి తదితరులు పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలాఉంటే.. చిరంజీవి, అల్లు అర్జున్‌, గోపీచంద్‌ మలినేని తమ తదుపరి చిత్రాలను మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై చేస్తున్న విషయం తెలిసిందే

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు