Home సినిమాలు 'ఉప్పెన' ద‌ర్శ‌కుడి రెండో సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే..?

‘ఉప్పెన’ ద‌ర్శ‌కుడి రెండో సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే..?

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా తొలి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించారు. ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బుచ్చిబాబు వార్తల్లో నిలిచారు. సుకుమార్‌కు అసలు సిసలు శిష్యుడు అనిపించుకున్నారు. ‘ఉప్పెన’ హిట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బుచ్చిబాబుతో మరో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. 

ఇందులో రెండో సినిమా అక్కినేని నాగ చైతన్యతో చేయబోతున్నారని సమాచారం. ఇప్ప‌టికే ఆయ‌న‌కు క‌థ వినిపించ‌డం మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వడం కూడా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం నాగా చైత‌న్య థ్యాంక్యూ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. విక్ర‌మ్ కుమార్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో చై పల్లెటూరి కుర్రాడు, ఎన్నారైగా కనిపించనున్నారట. మరోవైపు నాగచైతన్య లేటెస్ట్‌ మూవీ లవ్‌స్టోరి విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయి పల్లవి నటించింది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు