Home సినిమాలు 'ఉప్పెన’ దర్శకుడికి ఎన్టీఆర్ బంపర్‌ ఆఫర్‌

‘ఉప్పెన’ దర్శకుడికి ఎన్టీఆర్ బంపర్‌ ఆఫర్‌

మెగా హీరో వైష్ణవ్ తేజ్, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ఉప్పెన ఈ సినిమా ఫిబ్రవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు.. మొదటి సినిమానే అయినా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల చేత, సినీ దిగ్గజాల చేస్తా శబాష్ అనిపించుకున్నాడు.

ఇప్పటికే భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది. కాగా, ఈ సినిమాలో కథాకథనాలను ఆసక్తికరంగా నడిపించడంలో..పాత్రలను మలిచిన తీరులో దర్శకుడు బుచ్చిబాబు కనబరిచిన ప్రతిభను అందరు కొనియాడుతున్నారు. ఇక ఈ దర్శకుడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట… అందమైన లవ్ స్టోరీస్ చేయమని చాలా మంది బుచ్చిబాబుని అప్రోచ్ అవుతున్నారట. 

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉప్పెన సినిమా చూసి ఎంతో ఇంప్రస్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ‘నాన్నకు ప్రేమతో..’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టేలా కనిపించడం లేదు.. చూడాలి మరి ఎం జరుగుతుందో..

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు