Home సినిమాలు 'ఉప్పెన' దర్శకుడికి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన నిర్మాతలు

‘ఉప్పెన’ దర్శకుడికి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన నిర్మాతలు

డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్‌, దర్శకుడు. వైష్ణవ్‌ తేజ్‌, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ హీరో, హీరోయిన్లకు ఊహించని.. భారీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారట. హీరో వైష్ణవ్‌ తేజ్‌కు కోటి రూపాయలు, హీరోయిన్‌ కృతీ శెట్టికి రూ.25 లక్షలు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.

అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ దర్శకుడు బుచ్చిబాబుకు రూ.75 లక్షలు
బెంజి జీఎల్‌సీ కారును గిఫ్ట్ గా అందించారు. దింతో ఆ బహుమతిని అందుకున్న బుచ్చిబాబు తన గురువు సుకుమార్ తో తన ఫస్ట్ రైడ్ కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్‌ పుష్ప, మహేష్‌ బాబు సర్కార్‌ వారి పాట వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలు కూడా ఉన్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు