Home సినిమాలు 'ఉప్పెన'లో రామ్ చరణ్ అన్న అలా చేయమన్నాడు: వైష్ణవ్‌ తేజ్

‘ఉప్పెన’లో రామ్ చరణ్ అన్న అలా చేయమన్నాడు: వైష్ణవ్‌ తేజ్

డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్‌, దర్శకుడు. వైష్ణవ్‌ తేజ్‌, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ నటన చాలా బాగుందని, ముఖ్యం తన కళ్లు, కనుబోమ్మలతో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటు సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ ఓ అసక్తికర విషయం వెల్లడించాడు.

‘ఉప్పెన’ సినిమా షూటింగ్‌ ప్రారంభించే ముందు రామ్ చరణ్ తనకు ఓ సలహా ఇచ్చాడని పేర్కొన్నాడు. “రామ్ చరణ్ అన్న సినిమాలో నా కనుబొమ్మలను ఎంత కుదిరితే అంత ఉపయోగించమని చెప్పాడు. ఇలా చేస్తే సినిమాలో నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని, అది మూవీ విజయం సాధించడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పినట్లు వైష్ణవ్‌ వివరించాడు” ఇక ఇటీవల ‘ఉప్పెన’ గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే.

మరోవైపు ‘ఉప్పెన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ్, బాలీవుడ్‌లోకి కూడా రీమేక్‌ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ సూపర్‌ హిట్‌ మూవీని ఓటీటీలోకి కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు