Home సినిమాలు ఉగాది కానుకగా నాని 'టక్ జగదీష్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

ఉగాది కానుకగా నాని ‘టక్ జగదీష్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నానితో ‘నిన్నుకోరి’ లాంటి హిట్ కొట్టిన శివ నిర్వాణ.. ఇప్పుడు జానర్ మార్చి నేచురల్ స్టార్‌ను సరికొత్తగా చూపించబోతున్నారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్.. ఇలా భారీ తారాగణమే ఉంది.
కాగా, తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ఏప్రిల్ 13న ‘టక్ జగదీష్’ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీని కోసం వైజాగ్ లో గ్రాండ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కళ్లకు కాటుక,చేతులకు పారాణి,నుదుటన బొట్టు పెట్టుకొని పెళ్లి కొడుకులా ముస్తాబైన నాని.. పట్టు పంచె పైకి కట్టి ఓ రథం ముందు నిలబడి ఉన్నాడు. కాగా, నాని 26వ సినిమాగా రూపొందిన ‘టక్ జగదీష్’ను షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు