Home సినిమాలు ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్‌లో 'వ‌కీల్ సాబ్'

ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్‌లో ‘వ‌కీల్ సాబ్’

‘వకీల్ సాబ్’ చిత్రంతో మూడేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ వద్ద భారీ  కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన  ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజ్‌ నిర్మించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 9న విడుదలైన ‘వకీల్‌ సాబ్‌’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే తొలి వారంలో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు క్యూ కట్టారు. కాని రెండో వారం వ‌చ్చే స‌రికి ప‌రిస్థితులు ఒక్కసారిగా మారి పోయాయి.న్కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడం, కేసులు పెరగడం, థియేటర్లు మూతపడటం జరిగుపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా రన్ చాలా త్వరగా ముగిసిపోయింది. దీంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ ఎర్లీ రిలీజ్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే వ‌కీల్ సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 30(నేడు) నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నిజానికి 50 రోజుల తర్వాత వకీల్ సాబ్‌ను ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు కానీ, ఊహించని పరిస్థితుల కారణంగా ముందే రిలీజ్ చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు