Home ప్రత్యేకం ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

వెండితెరపై కలెక్షన్ల వర్షం కురిపించే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యూట్యూబ్‌లోనూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ ‘పుష్ప’ సరికొత్త రికార్డులను సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఏప్రిల్‌ 7న పుష్ప టీజర్‌ రిలీజ్‌ అవగా అందులో అల్లు అర్జున్ లుక్‌ను చూసి అభిమానులు షాకయ్యారు. పుష్పరాజ్‌గా ఊరమాస్‌ లుక్‌లో కనిపించి దుమ్మురేపాడు బన్నీ. తాజాగా ఈ టీజర్‌ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్‌ లైక్స్‌ను సంపాదించింది. అత్యంత తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను చేరుకున్న తెలుగు టీజర్‌గా ‘పుష్ప’ అరుదైన రికార్డు సాధించింది.
దీంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా పుష్ప లుక్ ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు