Home ప్రత్యేకం ఈనెల 15న 'ఆర్ఆర్ఆర్' నుంచి మరో సర్‌ప్రైజ్

ఈనెల 15న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‌ప్రైజ్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరిస్‌, చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ సందడి చేయనున్నారు. 

అయితే, తాజాగా ఈ సినిమా నుండి అలియా భట్‌కి సంబంధించి ఒక సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఆలియా భట్ ఫస్ట్ లుక్‌ను మార్చి 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌లో అలియా పాల్గొంది. త్వరలో తీయబోయే మరో షెడ్యూల్‌లో కూడా అలియా పాల్గొంటుందని సమాచారం. ఈ సినిమా నుండి ఇప్పటికే కీలక నటీనటుల ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడికల్‌ డ్రామాను నిర్మిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు