Home ప్రత్యేకం ‘ఇఫ్‌ యు ప్లే స్మార్ట్‌ విత్‌ అవుట్‌ స్టుపిడ్‌ ఎమోషన్స్‌': ఉత్కంఠగా రవితేజ ‘ఖిలాడి’ టీజర్‌

‘ఇఫ్‌ యు ప్లే స్మార్ట్‌ విత్‌ అవుట్‌ స్టుపిడ్‌ ఎమోషన్స్‌’: ఉత్కంఠగా రవితేజ ‘ఖిలాడి’ టీజర్‌

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఖిలాడి’. ఇందులో డింపుల్‌ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో మొదలైన సంగతి తెలిసిందే. జయంతీలాల్‌ గడ సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం టీజర్‌ని కొద్ది సేప‌టి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవ‌లం స‌న్నివేశాల‌తో సినిమాపై ఆస‌క్తిని పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ర‌వితేజ రెండు పాత్ర‌ల‌లో క‌నిపించి ఆద్యంతం ఆక‌ట్టుకున్నాడు.

కాగా, రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ‘ఖిలాడి’ చిత్రంలో అర్జున్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రవితేజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ఓకే చేశారు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాల డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

 

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు