Home వార్తలు ఇది సరైన సమయం కాదు.. రాజకీయ అరంగేట్రంపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇది సరైన సమయం కాదు.. రాజకీయ అరంగేట్రంపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

వెండితెర‌పై దుమ్మురేపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై కూడా ఆదరగొట్టేందుకు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే  బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో అల‌రించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షోతో ముందుకొస్తున్నాడు. ఇప్పటికే అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ప్రోమో షూట్ ఎన్టీఆర్ కంప్లీట్ చేయగా.. దర్శకుడు త్రివిక్రమ్ ఈ ప్రోమోకి డైరెక్షన్ చేశారు.  తాజాగా ఎన్టీఆర్ ప్రోమో విడుద‌లైంది. ఇది షోపై మరింత ఆస‌క్తిని క‌లిగిస్తుంది. 

ఈ క్రమంలోనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని జెమినీ చానల్ నిర్వహించింది. అందులో భాగంగా రిపోర్టర్లతో ఎన్టీఆర్ ముచ్చటించారు. వారడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ రిపోర్టర్.. రాజకీయ అరంగేట్రం ఎప్పుడుంటుందంటూ ప్రశ్నించగా.. దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్టైల్లో సమాధానం చెప్పారు. “ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ‘ఇది సరైన సమయం కాదు.. సందర్భమూ కాదు’. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందామని యంగ్ టైగర్ చెప్పుకొచ్చారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు