Home సినిమాలు ఇటలీలో హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న నాగచైతన్య

ఇటలీలో హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న నాగచైతన్య

‘మనం’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘థాంక్యూ’. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ అవికా గోర్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల వైజాగ్ లో ఓ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేయగా.. కోవిడ్ నేపథ్యంలో రద్దు చేసుకున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని తెలుస్తోంది.

రోనా పరిస్థితుల్లో కూడా ‘థ్యాంక్యూ’ చిత్రబృందం తాజాగా ఇటలీలో ల్యాండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘థ్యాంక్యూ’ చిత్రానికి వర్క్ చేస్తున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ షూటింగ్ లొకేషన్స్ తీసిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. హీరో నాగచైతన్య – డైరెక్టర్ విక్రమ్ ఫోటోలను షేర్ చేసిన పీసీ శ్రీరామ్.. పాండమిక్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటలీలో 15 రోజుల పాటు ఉండే షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో  నాగచైతన్య, రాశీఖన్నా కాంబినేషన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు