Home సినిమాలు ఇక సమరమే అంటున్న సుమంత్.. ఆసక్తికరంగా 'క‌ప‌ట‌ధారి' థీమ్ ట్రైల‌ర్

ఇక సమరమే అంటున్న సుమంత్.. ఆసక్తికరంగా ‘క‌ప‌ట‌ధారి’ థీమ్ ట్రైల‌ర్

వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించే టాలీవుడ్ హీరో సుమంత్ మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆయన నటించిన తాజా సినిమా ‘క‌ప‌ట‌ధారి’. క‌న్న‌డలో సూప‌ర్ హిట్ సాధించిన `కావ‌లుధారి` సినిమాకు ఇది రీమేక్‌. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించారు. కాగా, ఆర్కియాల‌జీలో ఎప్పుడో జ‌రిగిన హ‌త్య‌… హంత‌కుడు ఎవ‌రో తెలియ‌దు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా అంతు ప‌ట్ట‌ని ఆ హంత‌కుడు ర‌హ‌స్యాన్ని ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్ట‌ర్ ఎలా చేధించాడ‌నే కథాంశంతో రూపొందిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘క‌ప‌ట‌ధారి’.

ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మించారు. సైమ‌న్ కె.కింగ్ సంగీతం అందిస్తున్నారు. నాజర్‌, సంపత్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర థీమ్‌ ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ‘క‌ప‌ట‌ధారి’ చిత్రయూనిట్ వైవిధ్యంగా చేసిన ప్రమోషన్స్ సినిమాపై  మరింత ఆస‌క్తిని పెంచాయి. ఇదిలావుంటే.. ఫిబ్ర‌వ‌రి 16 రోజున ‘క‌ప‌ట‌ధారి’ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు