Home క్రీడలు ఇండియా ౩౦౦. రోహిత్ శర్మ 161.

ఇండియా ౩౦౦. రోహిత్ శర్మ 161.

విజృంభించిన రోహిత్ శర్మ. పటిష్ట స్థితిలో భారత్

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు చెన్నై లో ప్రారంభమైన రెండవ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.  మొదటి రోజు ఆటలో రోహిత్ శర్మ ఆట హైలైట్.  ఈ మ్యాచ్ కు ప్రేక్షకులను స్టేడియంలో కి అనుమతించారు.  ప్రేక్షకుల చప్పట్లు, కేరింతలు ఇచ్చిన ఉత్సాహంతో ఏమో రోహిత్ శర్మ మునుపటి ఫామ్ అంది పుచుకున్నాడు. 17 బౌండరీలు, 2 సిక్సర్ల తో 161పరుగులు చేసి లీచ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.  రహానే నుంచి చక్కని సహకారం లభించింది. 67 పరుగులు చేసిన రహానె మొయిన్ అలీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.  పంత్ వేగంగా ఆడుతూ 33 పరుగులతో అజేయం గా అక్షర్ పటేల్ తో పాటు క్రీజ్ లో ఉన్నాడు.

రోహిత్ శర్మ పుజారా తో కలసి రెండవ వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, రహానే తో కలసి నాలుగవ వికెట్ కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.  రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే రహానే కూడా అవుట్ అయ్యాడు. కాగా గిల్, కెప్టెన్ కోహ్లీ డక్ అవుట్ అయ్యారు.  ఇంగ్లాండ్ బౌలర్ల లో స్పిన్నర్ లు లీచ్, అలీ రెండేసి వికెట్లు తీయగా పేసర్ స్టోన్,కెప్టెన్ రూట్ తలా ఒక వికెట్ తీశారు. 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు