Home సినిమాలు ఆ స్టార్‌ డైరెక్టర్‌తో బాలయ్య నెక్ట్స్‌ మూవీ

ఆ స్టార్‌ డైరెక్టర్‌తో బాలయ్య నెక్ట్స్‌ మూవీ

‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎఫ్‌ 2’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో మంచి జోరు మీదున్న యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి. వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీస్తూ హిట్‌ డైరెక్టర్‌ అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్‌​3 సినిమాను తెరకక్కిస్తున్నారు. ఇంతకుముందు హిట్ కొట్టిన ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఓ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలో బాలయ్యకు ఓ పవర్ ఫుల్ స్టోరీ వినిపించగా, ఆయన వెంటనే గ్రీన్‌ సిగ్నాల్‌ ఇచ్చాడని సమాచారం.

కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాక ఈ ప్రతిష్టాత్మక సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ అనే సినిమాలో నటిస్తున్నారు బాలయ్య. దీని తర్వాత గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయనున్నాడు. దాని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు