Home సినిమాలు ఆ సీన్స్ 'సర్కారు వారి పాట'లో హైలెట్ అవ్వబోతున్నాయి..!

ఆ సీన్స్ ‘సర్కారు వారి పాట’లో హైలెట్ అవ్వబోతున్నాయి..!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌ జంటగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కామెడీ సన్నివేశాలు ఓ రేంజిలో అలరించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ పరశురామ్ డీసెంట్ కామెడీ ట్రాక్ ను రాశాడని, సప్తగిరి, ప్రియదర్శి మధ్య సాగే ఈ కామెడీ ట్రాక్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఈ ట్రాక్ మొత్తం సెకెండ్ హాఫ్ లో వస్తోందట. అలాగే ఈ ట్రాక్ లో అనసూయ కూడా ఉంటుందట. వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయని అంటున్నారు.
కాగా, ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేష్ బాబు ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా సినిమా తెరకెక్కనుందని సమాచారం

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు