Home సినిమాలు ఆ మూవీలో లాయర్‌గా రవితేజ.. మాస్ మహారాజా అభిమానులకు పండగే!

ఆ మూవీలో లాయర్‌గా రవితేజ.. మాస్ మహారాజా అభిమానులకు పండగే!

‘క్రాక్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేశారు మాస్‌ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెప్పేశారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌ అయిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమా చేయనున్నారు. ‘ఆర్టీ68’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మాస్ మహారాజ్ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ఈ చిత్రంలోనూ ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. వీరిలో శ్రీలీలా, లవ్లీ సింగ్‌ ఉన్నారు. ఇందులో మరో  కథానాయికగా ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లాను తీసుకోనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కుమార్‌ బెజవాడ అందిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తి కమర్షియల్‌ హంగులతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు