Home ప్రత్యేకం 'ఆ మాటలే నన్ను ప్రభావితం చేశాయి.. పవర్ స్టార్ గా మీ ముందు నిలబెట్టాయి..'

‘ఆ మాటలే నన్ను ప్రభావితం చేశాయి.. పవర్ స్టార్ గా మీ ముందు నిలబెట్టాయి..’

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయినా పింక్‌ మూవీకి రీమేక్‌ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఆదివారం రోజు (ఏప్రిల్ 4న) శిల్పకళా వేదికగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు చిత్రసీమకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన దిల్ రాజుగారి లాంటి వ్యక్తితో.. వకీల్ సాబ్ వంటి సినిమాను చేసినందుకు.. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా కోసం సినిమాలు చేయమని నేను ఎవరిని యాచించలేను. అసలు నేనెప్పుడూ నటుడు కావాలి అనుకోలేదు. నేనెప్పుడూ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చెప్తూ ఉంటాను.

నేను చాలా సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను అని. నన్ను ఎవరు గుర్తించకూడదు. నన్ను ఎవరు చూడకూడదు. చాలా నిరాడంబరంగా జీవితం గడపాలని అనుకుంటున్నాను అని.. కానీ నాకు అది తప్ప అన్ని జరిగాయి. మా అన్నయ్య చిరంజీవిగారు అన్న ఒక మాట నన్ను నటుడిని చేసింది. నీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అన్నదమ్ముల బాధ్యత లేదు. కాబట్టి నువ్వు ఒక నటుడివి అయ్యి ఏదో ఒక పని చేయాలి అన్నారు. ఆరోజు ఆయన అన్న ఆ మాటలు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాయి. అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు