Home ప్రత్యేకం ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో కలిసి నటించనున్న చిరు-నాగ్!

ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో కలిసి నటించనున్న చిరు-నాగ్!

తెలుగుచిత్రసీమలో అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి – కింగ్ నాగార్జున మధ్య ఉండే స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గానే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ గా మెలుగుతుంటారు. వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అభిమానులే కాకుండా చిరు – నాగ్ కూడా కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇద్దరితో భారీ మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.

ఇటీవల నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్. నూతన దర్శకుడు సోల్మాన్ తెరకెక్కించిన వైల్డ్ డాగ్ చిత్రం థియేటర్లో ఆశించిన స్ధాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయినా.. ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే.. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చింది. అంతే.. సినిమా చూసిన నెక్ట్స్ డే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నాగార్జునను అలాగే వైల్డ్ డాగ్ టీమ్ ను చిరంజీవి మనస్పూర్తిగా అభినందించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, నాగార్జున కలిసి నటించే సినిమా ఎప్పుడు అని జర్నలిస్టులు అడిగితే… సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అని చెప్పారు చిరంజీవి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్లాక్ బస్టర్ విక్రమ్ వేద రీమేక్ లో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి – విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన విక్రమ్ వేదా సినిమా కోలీవుడ్ లో ఘన విజయం సాధించింది. పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ గా మాధవన్.. గ్యాంగ్ స్టర్ వేద పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో చిరు – నాగ్ కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు