Home క్రీడలు ఆ ఘనత సాధించిన రెండో భారత్ క్రికెటర్‌గా‌ రోహిత్‌ శర్మ

ఆ ఘనత సాధించిన రెండో భారత్ క్రికెటర్‌గా‌ రోహిత్‌ శర్మ

ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. సిరీస్‌లో తొలిసారి భారీ స్కోరు సాధించింది. 8 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు 186 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6) భారీ షాట్లతో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడి అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే ఆఫ్ సెంచరీ సాధించాడు. యువ కెరటం రిషబ్‌ పంత్‌(30) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రోహిత్‌ శర్మ(12), కేఎల్‌ రాహుల్‌(14), విరాట్‌ కోహ్లీ(1) విఫలమయ్యారు.  ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌(4/33) భారత్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు.   

కాగా… ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్‌ ఆదిల్‌ రషీద్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. అదే ఓవర్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. మరోవైపు ఈ పోరులో ఓడితే టీమ్‌ఇండియా సిరీస్‌ చేజార్చుకుంటుంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు