Home వార్తలు ఆస్కార్ ‌2021 బరిలో నిలిచిన సినిమాలు ఇవే!

ఆస్కార్ ‌2021 బరిలో నిలిచిన సినిమాలు ఇవే!

2021 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులకు నామినేషన్లను ఆస్కార్ అకాడమీ సోమవారం ప్రకటించింది. 93వ అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాల జాబితాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త ప్రముఖ గాయకుడు నిక్‌ జోన్స్‌ ప్రకటించారు. ఇందులో బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించిన ‘మ్యాంక్’.. మొత్తంగా 10 విభాగాలలో నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. గారీ ఓల్డ్‌మాన్ ఈ సినిమాలో సిటిజన్ కేన్ రచయిత హెర్మన్ మాంకెవిజ్ పాత్ర పోషించారు. 

ఈ ఏడాది ఎనిమిది మంది బ్రిటిష్ నటీనటులు, సినీ కళాకారులు ఆస్కార్లకు నామినేట్ అయ్యారు. వారిలో సాచా బారన్ – కొహెన్, కేరి ముల్లిగన్, ఒలీవియా కోల్మన్, డేనియల్ కలూయా, సర్ ఆంథోని హాప్కిన్స్ ఉన్నారు. ఇక ప్రియాంక చోప్రా నటించిన ‘వైట్‌ టైగర్‌’కు అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది. అలాగే అంతర్జాతీయ చిత్రాల కేటగిరీలో తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
ఉత్తమ చిత్రం
◆ ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌
◆ సౌండ్‌ ఆఫ్ మెటల్‌
◆ ది ట్రయల్‌ ఆఫ్‌ ది చికాగో 7
◆ ది ఫాదర్‌
◆ జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్య
◆ మ్యాంక్‌
◆ మినారి
◆ నో మ్యాడ్‌ ల్యాండ్‌
ఉత్తమ నటుడు
★ చాడ్విక్‌ బోస్‌మెన్‌( మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
★ ఆంథోని హాప్కిన్స్‌(ద ఫాదర్‌)
★ రిజ్‌ అహ్మద్‌ (సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
★ స్టీవెన్‌ యెన్‌(మినారి)
★ గ్యారీ ఓల్డ్‌మెన్‌(మ్యాంక్‌)
త్తమ నటి
● ఫాన్సిస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌(నో మ్యాడ్‌ ల్యాండ్‌)
● క్యారీ మల్లిగన్‌(ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
● వయోలా డేవిస్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
● ఆండ్రా డే (ది యునైటెడ్‌ స్టేట్స్‌ వర్సెస్‌ బైలీ హాలీడే)
● వెనీస్సా కిర్బీ(పీసెస్‌ ఆఫ్‌ ఎ ఉమెన్‌)
ఉత్తమ దర్శకుడు
◆ డేవిడ్‌ ఫించర్‌(మ్యాంక్‌)
◆ క్లోవీ చావ్‌(నోమ్యాడ్‌ ల్యాండ్‌)
◆ థామస్‌ వింటర్‌ బెర్గ్‌(అనదర్‌ రౌండ్‌)
◆ లీ ఐజాక్‌ చుంగ్‌(మినారి)
◆ ఎమరాల్డ్‌ ఫెన్నల్‌ (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు