Home సినిమాలు ఆసక్తికరంగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్

ఆసక్తికరంగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్

యువ కథానాయకుడు సుశాంత్‌ హీరోగా. డి.దర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘నా జీవితంలో అమ్మకి.. అమ్మాయికి.. బైక్‌కి ‘అభి’నాభావ సంబంధం ఉంది’’ అంటూ సుశాంత్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఆ తర్వాత వెంటనే ఎవరా ‘అభి’ అని వెన్నెల కిషోర్‌ అడగటం నవ్వులు పూయిస్తోంది.  తనకి ఇష్టమైన బైక్‌ వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రేమించిన అమ్మాయి మనసును ఎలా గెలుచుకున్నాడు?ఇలాంటి సన్నివేశాలను టీజర్‌లో చూడొచ్చు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, సుశాంత్‌ల కాంబినేషన్ చక్కగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

కాగా,రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాణంలో ఏ1 స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్‌ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు