Home వార్తలు ఆల హస్తినాపురం లో

ఆల హస్తినాపురం లో

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 20 రోజులు గా ఆందోళన చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.   చట్టాలను రద్దు చేసేవరకు వెనక్కు తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు.  అన్నదాతలు ఈ ఆందోనళనలను మరింత ఉధృతం చేసేలా ఉన్నారు. రైతులకు మద్దతుగా విద్యార్థులు కూడా ధర్నా చేపట్టారు.  రైతుల ఆందోళనలకు మద్ధతు పెరుగుతూ ఉంది

ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాణాలర్పించిన అన్నదాతల కోసం ఈ నెల 20 న శ్రద్ధాంజలి దినంగా పాటిస్తామని రైతు నేతలు ప్రకటించారు

రైతులు తమ వైఖరి స్పష్టం గా తెలియ చేశారు.  అయినా సరే ప్రభుత్వం చర్చలంటూ ఎందుకు కాలాయాపన చేస్తోందో తెలియడం లేదు.

ఇక్కడ అర్ధం కాని కొన్ని అంశాలు ఏమంటే

  • రైతల కోసం చేసే చట్టాలను రైతులే వద్దంటుంటే ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తోంది…?
  • నిజం గా రైతులకు మేలు చేసే చట్టాలైతే రైతులకు అర్ధం అయ్యే విధం గా ఎందుకు చెప్పలేక పోతున్నారు….?
  • ప్రధానమంత్రి గా మోడీ గారు శాశ్వతం అనుకుంటున్నారా…?
  • కార్పొరేట్ కంపెనీలకు ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధం ఉండదు అనే విషయాన్నీ చట్టంలో పెడతారా..?
  • భారతీయ జనతా పార్టీ విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని పదే పదే చెపుతున్నారు.  అధికారం లో ఉన్నది మీరు.  రైతులతో చర్చలు జరుపుతున్నది మీరు…అటువంటప్పుడు, రైతులకు అర్ధం అయ్యేలా చెప్పే బాధ్యత మీదే కదా….?
  • ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఎకానమీ మళ్ళి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
  • రైతుల ఆందోళనల వల్ల కొన్ని కోట్ల నష్టం అని CII వారు చెపుతున్నారు…ఈ నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు.?
  • ప్రధాన మంత్రి మోడీ గారు స్వయం గా వచ్చి, ఈ నూతన చట్టాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి, రైతులకు అర్ధం అయ్యే విధం గా చెప్పవచ్చు కదా.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు