Home ప్రత్యేకం ఆలిండియా రికార్డ్స్ బ్రేకింగ్: విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'

ఆలిండియా రికార్డ్స్ బ్రేకింగ్: విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తుండగా, కొమరం భీం పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజర్స్ విడుదలై అభిమానులను అలరించాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని ఫార్మాట్లతో కలిపి రూ. 900 కోట్లు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 400కోట్లు. దీన్ని బట్టి చూస్తే సినిమా ఇప్పటికే రెట్టింపు కలెక్షన్స్ పొందినట్లు తెలుస్తోంది. ఇంతవరకు భారత సినీ చరిత్రలో ఏ సినిమా కూడా విడుదలకు ముందు ఈ రేంజిలో బిజినెస్ చేయలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఆల్ రైట్స్ రిపోర్ట్స్ పరిశీలిస్తే.. సౌత్ ఇండియా థియేట్రికల్ రైట్స్ – 330కోట్లు ఓవర్ సీస్ – 70కోట్లు నార్త్ ఇండియా ఆల్ రైట్స్ – 475 కోట్లు మ్యూజిక్ – 25కోట్లు కలిపి మొత్తంగా సినిమా 900కోట్ల బిజినెస్ జరిపిందని సమాచారం. చూడాలి మరి రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్‌లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుందనేది!

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు