Home సినిమాలు ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌..!

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత దేశమంతా దక్షిణాది సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ క్రమంలో బాహుబలి విజయం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న దర్శకధీరుడు పూర్తిగా ఆర్‌ఆర్‌ఆర్‌కే అంకితమైపోయాడు. పైగా స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్‌ హీరోలు  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తుండటంతో ప్రేక్షక లోకం ఈ సినిమాపై ఉత్సుకత ప్రదర్శిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది..


అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టించారు చిత్ర బృందం.ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్‌పై దూసుకుపోతుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ గుర్ర‌పు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌తో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు