Home ప్రత్యేకం 'ఆర్‌ఆర్‌ఆర్‌' మరో రికార్డ్: థియేట్రికల్ రైట్స్ 'లైకా' చేతికి.. ఎంతో తెలుసా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో రికార్డ్: థియేట్రికల్ రైట్స్ ‘లైకా’ చేతికి.. ఎంతో తెలుసా?

ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను మేం దక్కించుకున్నామని ప్రకటించడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది’’ అని లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ లో పేర్కొంది. 
అయితే, ఈ థియేట్రికల్ రైట్స్‌ను లైకా ప్రొడక్షన్స్ రూ.45 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై లైకా ప్రొడక్షన్స్ అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి త‌మిళ‌నాడులో రాజ‌మౌళి సినిమాల‌కు విపరీత‌మైన క్రేజ్ ఉంటుంది. అందువ‌ల్లే త‌మిళ థ్రియాట్రిక‌ల్ రైట్స్ కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో బాహుబ‌లి 2 త‌మిళ రైట్స్ కు రూ.37 కోట్లు ప‌లికాయి. ‌దీంతో పోలిస్తే మార్కెట్ లో ఆర్ఆర్ఆర్ ప్ర‌భంజ‌నం ఓ రేంజ్‌లో ఉంటుంద‌నిపిస్తోంది. 
కాగా, భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌‌, సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌, చరణ్‌ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియా భట్‌ నటించారు. అజయ్‌దేవ్‌గణ్‌ కీలక పాత్రలో అలరించనున్నారు. దాదాపు రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. 2021 అక్టోబర్‌ 13న ఈ సినిమా విడుదల కానుంది.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు