Home ప్రత్యేకం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. చరిత్ర సృష్టిస్తున్న మెగా, నందమూరి వారసులు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. చరిత్ర సృష్టిస్తున్న మెగా, నందమూరి వారసులు!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరం భీంగా రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. కీరవాణి సంగీత స్వరాలు స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్మడుపోయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ చేంజ్ భారీ మొత్తం చెల్లించి సరిగమ సినిమాస్, రాఫ్తార్ క్రియేషన్స్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు దక్కించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అక్టోబర్ 12న యూఎస్ఏ లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక తమిళ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కొనుగోలు చేయగా.. కర్ణాటకలో ఏషియన్, వారాహి సంస్థలు ఈ సినిమాని విడుదల చేయబోతున్నాయి. ఇక్క్ నార్త్ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ని ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్తూడియోస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు