Home ప్రత్యేకం 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి మరో భారీ సర్‌ప్రైజ్‌ రెడీ!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో భారీ సర్‌ప్రైజ్‌ రెడీ!

కొత్త ఏడాదిలో వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తామంటూ ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లుగానే సందర్భాన్ని బట్టి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఇస్తోంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌: డైరీస్‌’ పేరుతో షూటింగ్‌కు సంబంధించిన చిన్న చిన్న వీడియోలను పంచుకుంటోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​ చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. శనివారం (మార్చి 27) చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్​ఆర్​ఆర్​’ నుంచి సీతారామరాజు కొత్త లుక్​ను​ విడుదల చేసింది చిత్రబృందం. అదిరిపోయేలా ఉన్న చరణ్​ లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామ్​చరణ్​ సరసన ఆలియా భట్​, ఎన్టీఆర్​ సరసన ఒలివియా మోరిస్​ నటిస్తున్నారు. అజ‌య్‌ దేవ్‌గ‌ణ్, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. అయితే ‘ఆర్​ఆర్​ఆర్​’ నుంచి ఇప్పుడు కొన్ని రోజుల వ్యవధిలోనే మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆలియా భట్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వచ్చే ఏప్రిల్ 2నే అజయ్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆ రోజున ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో అజయ్ లుక్ కోసం ఫాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఈ పోస్టర్ ఎలా ఉంటుందో అన్నది చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు