Home సినిమాలు ఆర్‌ఆర్‌ఆర్‌’ అదిరిపోయే అప్‌డేట్..రిలీజ్ డేట్ ఫిక్స్..

ఆర్‌ఆర్‌ఆర్‌’ అదిరిపోయే అప్‌డేట్..రిలీజ్ డేట్ ఫిక్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్‌ పీరియాడిక్‌ చిత్రం 2021లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు..


కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త  ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.. ఈ చిత్రం ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకోగా.. ఇంకా 20 శాతం షూటింగ్‌ జరగాల్సి ఉంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో మిగిలి ఉన్న చిత్రీకరణ జరుగుతోంది. అలాగే ఇందులో నాలుగు పాటలు ఉంటే.. ఈ నాలుగు పాటల్లోనూ ఇద్దరు హీరోలు కనిపించనున్నారని సమాచారం.. ఇక ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేసేలా రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట. మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ అంతా పూర్తి చేసి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని ఏ దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి యోచిస్తున్నట్లు సమాచారం..

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు