Home ప్రత్యేకం ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..!

ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరం భీంగా రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఎంఎం కీర‌వాణి ఆర్ఆర్ఆర్ కు స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో కీర‌వాణి కొడుకు కాల‌భైర‌వ ఓ పాట పాడ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రంలో చాలా ఎమోష‌న‌ల్ గా వ‌చ్చే పాట‌ను కాల‌భైర‌వ ఆల‌పించ‌నున్నాడ‌ని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా, కాలభైర‌వ‌కు కీర‌వాణి కొడుకుగానే అంద‌రూ అతడికి అవకాశాలు వస్తున్నాయని భావించారు. ఇప్పుడు మాత్రం తన మార్క్ చాటుకుంటూ, వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకెళ్తున్నాడు. ‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తండ్రిని పోలిన గాత్రంతో ఆయన శ్రోతలను అలరించారు. ఆ త‌ర్వాత అర‌వింద స‌మేత‌లో పెనివిటి పాట పాడి తన మార్క్ చూపించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు