Home ప్రత్యేకం 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఊహకందని ప్రేమకథలు!

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఊహకందని ప్రేమకథలు!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెర పైకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే… రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాలో అన్నదమ్ముల గొడవ తల్లి కొడుకు సెంటిమెంట్ తో పాటు రెండు ప్రేమ కథలను కూడా చూపించిన విషయం తెలిసిందే.
ప్రభాస్ అనుష్క అలాగే ప్రభాస్ తమన్నాల ప్రేమలను కథలో భాగంగానే అద్బుతంగా చూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కూడా రాజమౌళి రెండు అద్బుతమైన ప్రేమ కథలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నట్లుగా సమాచారం. ఆ రెండు ప్రేమకథలు ఎవరివంటే.. చరణ్ ఆలియా భట్ ల ప్రేమ గురించి అందరికి తెల్సిందే. అయితే… ఎన్టీఆర్ ప్రేమను ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికర విషయం. విదేశీ నటి ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. కొమురం భీమ్ కు అప్పటికే పెళ్లి అయినా కూడా విదేశీ యువతిని ప్రేమించడం జరగుతుందట. ఆ ప్రేమ అత్యంత మెచ్యూర్డ్ గా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. రాజమౌళి ఈ రెండు ప్రేమ కథలను కూడా అద్బుత దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు