Home ప్రత్యేకం 'ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్‌కి బర్త్ డే గిఫ్ట్.. అల్లూరి సీతారామరాజు మహోగ్రరూపం

‘ఆర్ఆర్ఆర్’ నుంచి చరణ్‌కి బర్త్ డే గిఫ్ట్.. అల్లూరి సీతారామరాజు మహోగ్రరూపం

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి అల్లూరి సీతారామరాజు మహోగ్రరూపం అంటూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో అల్లూరి గర్జన ఏరకంగా ఉండబోతోందో రామ్ చరణ్ లుక్ ను చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఇదిలా వుంటే రామ్ చరణ్‌ ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో ఆలియా సీతగా అతడితో జోడీ కడుతోంది. చరణ్ బర్త్‌డేను పురస్కరించుకుని ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది చిత్రయూనిట్‌. అందులో భాగంగా రామరాజు లుక్‌ను విడుదల చేసింది. దీంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇక  ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో  చరణ్‌తోపాటు ఎన్టీఆర్‌, అలియా భట్‌, ఒలివియా, అజయ్‌ దేవ్‌గన్‌  ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆక్టోబర్‌ 13న విడుదలకు సిద్ధమవుతోంది. అంతేగాక చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్యలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధ అనే  పాత్రలో అలరించనున్నాడు. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే క్లైమాక్స్‌ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మరోవైపు మిగిలిన షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసి, నిర్మాణానంతర కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాజమౌళి భావిస్తున్నారు.

 

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు