Home ప్రత్యేకం 'ఆర్ఆర్ఆర్': ఆ ఫోటోలు ఎలా బయటకి వచ్చాయి.. చిత్రబృందంపై నిప్పులు చెరిగిన జక్కన్న

‘ఆర్ఆర్ఆర్’: ఆ ఫోటోలు ఎలా బయటకి వచ్చాయి.. చిత్రబృందంపై నిప్పులు చెరిగిన జక్కన్న

తెలుగుచిత్రసీమను లీకుల బెడ‌ద ప‌ట్టి పీడిస్తుంది. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్, క్రిష్‌-ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంతో పాటు కొన్ని సినిమాల‌కు సంబంధించిన ఫిక్స్, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా  నుండి కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో  కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్న‌ ఎన్టీఆర్.. సంకెళ్ళు తెంచుతున్న‌ట్టుగా కనిపిస్తున్నాడు. మ‌రో ఫోటోలు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న‌ రామ్‌చ‌ర‌ణ్  బ్రిటీష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. ఒలీవియా, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫొటో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీనిపై చిత్ర దర్శకుడు రాజమౌళి చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షూటింగ్ వివరాలు బయటికి రావడం.. ఫోటోలు లీక్ కావడం జక్కనకు ఏ మాత్రం నచ్చడం లేదు.. దాంతో షూటింగ్‌లో మొబైల్స్ తో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు అన్ని బ్యాన్ చేశాడు రాజమౌళి. ఇకపై సెట్స్ లో నిబంధనలు ఇంకా కఠినతరం చేయనున్నాడు ఈ దర్శకధీరుడు. అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వచ్చేది లేదని నియమాలు జారీ చేశాడు. ఇలాంటివి మరోసారి జరగకూడదని ఇప్పటి నుంచి తగిన జాగ్రత్తగా తీసుకోవాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. 

కాగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. దానికి తగ్గట్టే మేకింగ్‌ విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు  రాజమౌళి. ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ ఓ రేంజ్‌లో ఉండాలని ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌నే రంగంలోకి దింపాడు. ఈ విషయం ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ అంటూ చిత్రయూనిట్ అధికారికంగా ఓ వీడియోను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు