Home సినిమాలు 'ఆదిపురుష్' బడ్జెట్ లో అగ్రభాగం అందుకోసమే ఖర్చుపెడుతున్నారట..!

‘ఆదిపురుష్’ బడ్జెట్ లో అగ్రభాగం అందుకోసమే ఖర్చుపెడుతున్నారట..!

వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా రాముడిగా నటిస్తుండగా, సీతగా కృతి సనన్ నటించబోతోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు.

ఇదిలాఉంటే.. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా అద్బుతమైన విజువల్ వండర్ గా హాలీవుడ్ స్టార్స్ కూడా ఆశ్చర్యపడేలా ఈ సినిమాను రూపొందించే ఉద్దేశ్యంతో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

హాలీవుడ్ సినిమాలకు పని చేసిన అనుభవజ్ఞులైన విజువల్ ఎఫెక్ట్ నిపుణులను ఈ సినిమా కోసం పని చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మోషన్ క్యాప్చర్ తో పాటు అనేక రకాలుగా ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ ను వాడబోతున్నారు. అద్బుతమైన విజువల్ వండర్ గా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు సినిమా బడ్జెట్ లో ఏకంగా 60 శాతంకు పైగానే విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు