Home ప్రత్యేకం 'ఆదిపురుష్' : అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన చిత్రబృందం!

‘ఆదిపురుష్’ : అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన చిత్రబృందం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

ఇదిలాఉంటే.. తాజాగా దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ గురించి ఆసక్తికరమైన అప్డేట్ ను ఇచ్చారు. కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న షెడ్యూల్ మేరకు షూటింగ్ పూర్తి చేయడానికి కష్టపడుతున్నామని, పరిస్థితులు కఠినంగానే ఉన్నా అన్నింటినీ తట్టుకుని పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్, సైఫ్ అలీఖాన్ అయితే తమ పాత్రల కోసం శారీరకంగా చాలా కష్టపడుతున్నారని, పాత్రలకు తగిన లుక్ మైంటైన్ చేయడానికి ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారని వెల్లడించారు. అలాగే ‘ఆదిపురుష్’ సెట్లో మాస్క్ తప్పనిసరి చేశామని, కరోనా నిబంధనలు పాటిస్తున్నామని, ఇప్పటికే 30 శాతం షూటింగ్ ముగిసిందని, రానున్న రోజుల్లో ఇంకా చాలా కష్టపడాల్సి ఉందని ఓం రౌత్ చెప్పుకొచ్చారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు